ప్రపంచ మహిళా దినోత్సవం.

జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ డిపో ఆవరణ నందు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గద్వాల డిపోలో మహిళా దినోత్సవ ప్రోగ్రాం ఈరోజు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా డ్యూటీ ల యందు ప్రతిభ కనబరిచిన మహిళ కండక్టర్స్ కు ప్రశంస పత్రాలు ఇవ్వడం మరియు రెగ్యులర్ గ ఆర్టీసీ బస్ ల యందు ప్రయాణించే మహిళ ప్రయాణికులను సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.