అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా రండి

Feb 1, 2025 - 19:37
 0  7
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా రండి

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా.. పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఈవో పురేందర్, ఆలయ అర్చకులు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం మూడో తేదీ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333