రేపాల గ్రామంలో టిఆర్ఎస్ ఎన్నికల జోరు గా ప్రచారం......

మునగాల 08 మే 2024 తెలంగాణవార్తా ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకి ఓటు వెయ్యమని ప్రజలను ఎన్నికల ప్రచారం నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు దగ్గరికి వెళ్లి గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కటికం సత్తయ్య గౌడ్ ,మండల పార్టీ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ ,తోగరు సీతారాములు ,ఎలక వెంకట్రెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షుడు పల్లి ఆదిరెడ్డి, మాజీ ఎంపిటిసి బత్తుల ఉషా శ్రీనివాస్, మొగిలిచర్ల సత్యనారాయణ , కార్యదర్శి కుంటిగోల్ల కృష్ణమూర్తి, గవిని పెద్ద లక్ష్మీనరసింహం, జిల్లేపల్లి వీరస్వామి, గండు సత్యనారాయణ గౌడ్, రావు వీరారెడ్డి (చింటూ) గుండు దేవదాసు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు