అమర వీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేస్తాం

అమర వీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేస్తాం *నెమ్మాది వేంకటేశ్వర్లు* *సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుల
తెలంగాణ వార్త పెన్ పహాడ్ : మండల పరిధిలోని భక్తాలపురం గ్రామం లో ఏర్రజెండా పట్టి అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తానని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు.. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో జనవరి 25-28తేదిల్లో జరిగిన రాష్ట్ర మహా సభలో పెన్ పహాడ్ మండలం నుండి మొట్ట మొదటి సారిగా రాష్ట్ర కమిటీ సభ్యులు గా ఎన్నికైన నెమ్మాది వేంకటేశ్వర్లుకు సోమవారం నాడు భక్తాళ్ళపురం గ్రామం లో చైతన్య వేదిక, పౌర స్పందన వేధిక సయింక్తంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అన్ని రాజకీయాలకు అతీతంగా గ్రామ యువతీ యువకులు, రాజకీయ నాయకులు ఘనంగా అభినందనలు తెలియ జేశారు... అంతక ముందు గ్రామం లో ఎర్రజెండా పట్టి అమరులైన వారి స్మారక స్టుపాలకు నెమ్మాది పూల దండలు వేసి శ్రద్దాంజలి ఘటించి జోహార్లు అర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తాల్లపురo గ్రామం నుండి విద్యార్థి ఉద్యమం నుండి జీవితాన్ని సిపిఎం ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నాటి నుండి ఈ రోజూ వరకు పాలక వర్గాల భ్రమలకు లోని కాకుండ నిజాయితీగా, నిబద్ధతతో నమ్మిన సిద్ధాంతం కొరకు సిపిఎం జెండా పార్టీ పోరాటం లో నిలబడడం ఎంతో గౌరవంగా ఉంది రానున్న కాలంలో పెన్ పహాడ్ మండలం లో తో పాటు జిల్లాలో పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కొరకు, కార్మికులకు కనీస వేతనాలు, వర్కర్ల సమస్యలపై ఉద్యమాలు చేసి ప్రభుత్వం పై వత్తిడి చెసే కార్మిక , కర్షక ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని నేను రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా నేను పుట్టి పెరిగిన మా గ్రామం లో రాజకీయాలకు అతీతంగా అక్కున చేర్చుకుని అభినందనలు తెలియజేసిన వారికీ దన్యవాదాలు నెమ్మాది తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపిటిసి చింతం వేంకటేశ్వర్లు అధ్యక్ష వహించగా గ్రామ పెద్దలు నల్లపు రామ్మూర్తి, యాటా ఉపేందర్,జుట్టుకోండ గణేష్, నెమ్మాధి ఆడివయ్య, మచ్చ లింగయ్య, బుస్సా వీరయ్య, పోకల గురవయ్య,ఇరుగు రమేష్, గోపాల్ దాస్ శ్రీరాములు, నెమ్మాది పీరయ్య, పసుపు లేటీ రమేష్ , గోపాల్ దాస్ వీరయ్య, వెంకన్న,బచ్చు రవి, నాగవెల్లి రాజేందర్, నెమ్మాది నవీన్,నెమ్మాది కిరణ్, గంధం గణేష్, నెమ్మాది శివ కుమార్, గోపాల్ దాస్ నాగార్జున,ఇరుగు రాములమ్మ, సౌభాగ్య, నల్లపు సతీష్, నెమ్మాది సతీష్, తదితరులు పాల్గొన్నారు..