ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

Feb 3, 2025 - 18:13
Feb 3, 2025 - 18:40
 0  20
ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : ఎస్సార్ ప్రైమ్ స్కూల్ లో ఘనంగా వసంత పంచమి వేడుకలు కోదాడ ఫిబ్రవరి 3, : డీజీఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ సురేష్ మాట్లాడుతూ సరస్వతి దేవి ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని కోరుకున్నారు . విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి విషయాన్ని సృజనాత్మకత దృష్టితో చూడటం ఎంతో అవసరం అన్నారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. విద్యార్థులకు వసంత పంచమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State