ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన

మాదిగ హక్కుల దండోరా నాయకులు.

Apr 7, 2024 - 20:31
Apr 7, 2024 - 20:48
 0  16
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన

జోగులాంబ గద్వాల 7 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర నాయకులు సూచన మేరకు వారిఆధ్వర్యంలో పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన మాది హక్కుల దండోరా రాష్ట్ర అధికార ప్రతినిధి సగ్గీ ప్రకాష్ మాదిగ నేడు హైదరాబాదులో తెలంగాణలో అత్యధిక జనాభాగా ఉన్న మాదిగలకు అన్ని రంగాలలో తెలంగాణ ప్రభుత్వం వస్తే బతుకులు మారుతాయి అనుకొని ముందు వరుసలో ఉండి తెలంగాణ కోసం పోరాడేమో అయినా మా బతుకులు ఇక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇంకా కూడా దిగజారిన బ్రతుకుల్లా మారుతున్నాయి.

  మాకంటూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇలాంటి మార్పు జరగలేదని మాకు మీ ఆధ్వర్యంలో అయినా మాకు న్యాయం జరిపించాలని మమ్మల్ని గుర్తించి మా యొక్క క్రింది హైదరాబాద్ నగరంలో మాదిగలకు ప్రత్యేక ఆత్మగౌరవ భవనం నిర్మించాలి, మాదిగలకురాజకీయంగా సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల అన్ని శాఖలలో ఉన్న ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వారికి బ్యాంకు తో సంబంధం లేకుండా పది లక్షల ఆర్థిక సహాయం అందించాలి అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసి. వారి యొక్క డిమాండ్ పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో దండు నరేందర్ మాదిగ, చిలుక రాజనర్స మాదిగ ,శంకర్ మాదిగ, చిలుక శ్యామ్ మాదిగ, సగ్గి ప్రకాష్ మాదిగ వారితోపాటు మాదిగ దండోరా నాయకులు పాల్గొనడం జరిగింది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State