అమరుల ఆశయాలను కొనసాగిద్దాం

Jun 18, 2024 - 20:29
Jun 18, 2024 - 20:38
 0  4
అమరుల ఆశయాలను కొనసాగిద్దాం

తెలంగాణ వార్త అమరుల ఆశయాలను కొనసాగిద్దాం!! భారత విప్లవోద్యమ నేతలు కామ్రేడ్ ఎంవి ప్రసాద్ వసంతక్కల 19వ వర్ధంతి సభ విజయవంతం* నే డు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీ ప్రసాద్ వసంతక్కల భవనంలో సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్ అధ్యక్షతన జరిగిన అమరుల 19వ వర్ధంతి సభను జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ ఎల్లుట్ల ఉపేందర్ హాజరై మాట్లాడుతూ ఈ దేశంలో భూమి బుక్తి విముక్తి కోసం ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలను తృణప్రాయంగా అర్పించడం జరిగింది.

 వారి వారసత్వాన్ని కొనసాగించడం కోసం వారి అడుగుజాడల్లో నూతన ప్రజాస్వామిక విప్లవంమే ఏకైకమర్గమని స్పష్టం చేశారు విప్లవం వర్ధిల్లాలని విప్లవం విజయవంతం కావాలంటే త్యాగం కావాలి అది తుచాతప్పకుండ ఆచరించిన గొప్పవిప్లవకరులుగా ఒకటై అమరులైనారు వారు చూపినవెలుగు దారిలో నడుస్తూ వారి ఆశయాలను కొనసాగింపు అమరులకు మనమిచ్చే నిజమైన నివాళి అని సి పి ఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విప్లవోద్యమంలో అశువులు బాసిన అందరికీ జోహార్లు అర్పించారు. భారతదేశంలో బిజెపి పార్టీ హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ మరలా అధికారం వచ్చిన దురహంకారంతోటి దోపిడీ పాలకవర్గాలు పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తులకు కొమ్ము ఖాస్తు అంబానీ, ఆదాని కంపెనీలకు రెడ్ కాఆర్పేట్ వేస్తున్నారు పాలకుల ప్రజాధనాన్ని దోపిడీ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి డోలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజాపాలనంటూ ప్రజాదర్బార్ నడిపించుకుంటూ ప్రజల్ని పీడిస్తున్నటువంటి విషయం గుర్తు చేస్తున్నారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు కుల గణన జరిపిన తర్వాతనే సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలని జనాభా దామాషా ప్రకారంగా సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం పోరాడే ఉద్యమకారులను హక్కు నేతలను ప్రశ్నించే పౌరులను దేశద్రోహులుగా అర్బన్ నక్సల్స్ గా చిత్రీకరిస్తున్నారు

 అరెస్టులు చేపిస్తూ కనీస ప్రజాస్వామిక హక్కులను హరించి వేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం పాలకుల భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టే పరిస్థితి ఉందనే ఆవేదన స్పష్టం చేస్తున్నాం గత పాలకులు తీసుకువచ్చినటువంటి సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ గుత్తా దీపత్య ఆర్థిక విధానాలను బిజెపి ప్రభుత్వం వేగిరేపరిచింది ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు కరణ చేస్తూ ప్రజల కనీసం హక్కులను సైతం కాల రాస్తున్నాయి నేడు యువత వీధిన పడ్డారు విద్యారంగంలోని స్కూళ్లలో తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారంగా బుక్కులు ప్రైవేటు స్కూళ్లలోని దందాన ఆపాలని స్కూల్ యూనిఫామ్ పేరిట దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకించాలని అలా జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ దుబ్బ మధు మాట్లాడుతూ వివరించారు

ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా సెక్రెటరీ దుర్గం సైదులు మాట్లాడుతూ భారతదేశంలోని అర్ధ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థను భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయాన్ని తుంగర తొక్కి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు కనుక అటువంటి ప్రైవేట్ కరణ నిలిపివేసి రైతు చట్టాలను తక్షణమే మాఫీ చేయాలని చతిస్గడ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాన్కార్ ఆపివేయాలని గిరిజనుల హక్కు చట్టాలను హరించవద్దని మాట్లాడుతూ సైదన్న ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యపేట జిల్లా కార్మిక విభాగ సెక్రెటరీ కామ్రేడ్ మల్లేషన్న మాట్లాడుతూ కార్మిక హక్కులను కాల రాస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.