అడ్డగూడూరు మండలంలో అధికారుల డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్
అడ్డగూడూరు 16 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎం.ఆర్ ఫంక్షన్ హాల్ లో ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని 150 పోలింగ్ కేంద్రాలు,150 వార్డులు, సర్పంచుల అభ్యర్థుల సంఖ్య 53, ఓటర్ల సంఖ్య 23022 అందులో పురుషుల సంఖ్య11320 స్త్రీల సంఖ్య 11702, మండలంలోని 17 గ్రామాలకు రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బందిని ఎన్నికల సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల పోలింగ్ కేంద్రాలకు పంపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘువీరారెడ్డి,ఎన్నికల అధికారి, తాసిల్దార్ శేషగిరిరావు,ఎంపీడీవో శంకరయ్య,ఎంఈఓ సబిత,ఎంపీఓ ప్రేమలత,ఏవో పాండురంగ చారి,ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలలో ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు సాఫీగా సాగేటట్టు ఓటర్లు పోలీసు వారికి సహకరించాలని గ్రామాల యువకులకు ఓటర్లకు తెలిపారు.ఓట్ల సమయంలో ఘర్షణలకు పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.