కలెక్టర్ హనుమంతరావు మూడవ విడుత పోలింగ్ కేంద్రాలను పరిశీలన
అడ్డగూడూరు 16 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండలంలోని మూడవ విడుత గ్రామ పంచాయతి ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్ కేంద్రాలను అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్లరామారం గ్రామంలో ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.అనంతరం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సక్రమంగా ఓటర్లకు అన్ని విధాలుగా సహకరించాలని అన్నారు. వృద్ధులకు,వికలాంగులకు,వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఓటర్లు 12 ఒంటి గంట సమయంలో లైన్లో నిల్చున్న వాళ్లకి ఓటు హక్కు వినియోగించుకునే సమయం కేటాయిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి,తాసిల్దార్ శేషగిరిరావు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.