అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్య యాదవ్

Feb 2, 2025 - 23:16
Feb 2, 2025 - 23:24
 0  51

అడ్డగూడూరు 02 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. మన దళిత ఎమ్మెల్యే మందుల సామెల్ అన్న తుంగతుర్తి నియోజకవర్గంలో 52,000 వేల పైన మెజార్టీతో గణ విజయం సాధించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది లీడర్లు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులె ఎమ్మెల్యే పై కాంగ్రెస్ పార్టీ పైన చెడ్డ పేరు తేవడానికి వెనకాడతలేరన్నారు.ఎమ్మెల్యే ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నారన్నారు. ఫిబ్రవరి 3న మోత్కూర్ లో జరిగే సభకు ఎమ్మెల్యేకు గాని మండల పార్టీ నాయకులకు గాని ఎలాంటి సంబంధం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కోప్పలు నిరంజన్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటుకాల చిరంజీవి, బాలెoల సైదులు,మోత్కూర్ మార్కెట్ కమిటీ బాలెoల విద్యాసాగర్,మేకల పవన్, మహిళ అధ్యక్షురాలు, విజయమ్మ, అడ్డగూడూరు గ్రామ శాఖ అధ్యక్షుడు సోమిరెడ్డి, వెల్దేవి గ్రామ శాఖ అధ్యక్షుడు మంటీపల్లి గంగయ్య,అజింపేట గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మగాని సైదులు, కొండంపేట గ్రామశాఖ అధ్యక్షుడు ఇటికాల సుధాకర్,కంచనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు చెరుకు వెంకన్న,రేపాక గ్రామశాఖ అధ్యక్షుడు పరశురాములు, బొడ్డుగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్ము నాగరాజు, మానేకుంట గ్రామశాఖ అధ్యక్షుడు దేశబోయిన వీరయ్య,గట్టుసింగారం గ్రామశాఖ అధ్యక్షుడు మార్త ఆంజనేయులు, జానకిపురం గ్రామశాఖ అధ్యక్షుడు ననుబోతు సోమయ్య, చిన్నపడిశాల గ్రామశాఖ అధ్యక్షుడు తీగల జ్ఞానేందర్ రెడ్డి, కోటమర్తి గ్రామశాఖ అధ్యక్షుడు చిత్తలూరి సోమయ్య, చిర్రగూడూర్ గ్రామశాఖ అధ్యక్షుడు సోమనారి, గోవిందపురం గ్రామశాఖ అధ్యక్షుడు రవి,లక్ష్మీదేవికాల్వ ధర్మారం వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.