వేసవి నీటి సరఫరా పై ప్రత్యేక పరిశీలన కార్యక్రమం
తెలంగాణ వార్త ఆత్మకూరుయస్: వేసవి నీటి సరఫరా పై ప్రత్యేక పరిశీలన కార్యక్రమం* ఆత్మకూర్ ఎస్.. వచ్చే వేసవిలో నీటి సరఫరా అంతరాయాన్ని నివారించేందుకు మండలంలోని గ్రామాల్లో పది రోజుల ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్లు rws ఏఈ రవికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడుతూ ఫిబ్రవరి 1నుండి 12వరకు జరిగే నీటి సరఫరా పరిశీలన కార్యక్రమాలకు నీటి సరఫరా అనుబంధ శాఖల ఏఈ లు, డీ ఈలు, ఎంపీడీవో ,ఎంపిఒ పంచాయితి కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు. గ్రామాల్లో నీటి సరఫరాల్లో అంతరాయం ఉన్నట్లయితే ప్రత్యేక పరిశీలన కార్యక్రమాలలో పాల్గొన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.