ఘనంగా అమావాస్య పూజలు.
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్. ఆదిశివ క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులను అలరిస్తున్నది. ఉదయం దేవాలయంలో వాల్మీకి పూజారులు అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు రాయచూరు జిల్లా గదారం గ్రామ వాస్తవ్యులు అయిన గట్టు ఈరన్న దంపతులు అన్నదాన కార్యక్రమానీ ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి శాంతినగర్ శివ శివాని టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.