అడ్డగూడూరులో పీఎం నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు
అడ్డగూడూరు 17 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు నన్నుబోతు సైదులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. అదేవిధంగా అంతకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి అడ్డగూడూరు మండల అధ్యక్షుడు ననుబోతు సైదులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణకు విముక్తి లభించింది అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ కూరాకుల అరుణ,తుంగతుర్తి కో కన్వీనర్ వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు దేశపోయిన నాగరాజు,మండల ప్రధాన కార్యదర్శిలు లింగాల నరసింహ గౌడ్,కొత్తోజు నవీన్ కుమార్,జిల్లా మాజీ కార్యదర్శి లింగాల శ్యామ్ సుందర్, మండల కోశాధికారి మరాఠీ కుమారస్వామి,బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బోయిని యాకస్వామి,భూత్ అధ్యక్షులు కూరాకుల యాదగిరి,లింగాల ఈశ్వర్ గౌడ్ నిమ్మల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.