అడ్డగూడూరులో పలు కార్యాలయాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు15 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం నూతన భవనాలకు భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతురావుతో కలసి పాల్గొన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు వివిధ కార్యాలయాలకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శేషగిరిరావు, కార్యాలయం సిబ్బంది ఎంపీడీవో శంకరయ్య,కార్యాలయం సిబ్బంది గ్రామపంచాయతీ కార్యదర్శులు,మండల పార్టీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి, మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, డైరెక్టర్లు బలేoల విద్యాసాగర్, చిత్తలూరు సోమయ్య,సీనియర్ నాయకులు వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.