అంబేద్కర్ ఆశయాలపై పోరాడుదాం

Dec 6, 2024 - 16:50
Dec 6, 2024 - 20:49
 0  3
అంబేద్కర్ ఆశయాలపై పోరాడుదాం

  చర్ల,డిసెంబర్ 6 :  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని,అటువంటి మహానీయుని ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీడీవో కనపర్తి ఈదయ్య,టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి తోటమల్ల రమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మాల మహానాడు మండల అధ్యక్షులు రుంజా రాజా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీవో కే ఈదయ్య, టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబా సాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని అన్నారు. అటువంటి మహనీయుని ఆశయాల కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి టి సురేష్, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఛీమలమర్రి మురళీకృష్ణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, మాల మహానాడు నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు,దొడ్డా ప్రభుదాసు, కొంగూరు నరసింహారావు,మోతుకూరి ప్రభాకర్, ఇప్ప ప్రభుదాసు, తోటమల్ల కృష్ణారావు, తోటమల్ల గోపాలరావు, కొంగూరు సత్యనారాయణ, రెక్కల వెంకట్, పొగాకు సత్తిబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.