నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు

Mar 12, 2025 - 18:41
Mar 12, 2025 - 19:47
 0  5
నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు. నిరసన దీక్షలకు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు సంఘీభావన తెలిపారు ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష.. ఆత్మకూరు ఎస్ :ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అయ్యేంతవరకు ఉద్యోగ ఫలితాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వాయిదా వేయాలని ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం ముందు బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలకు ముఖ్యఅతిథిగా ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు కనుకోట్ల వెంకన్న మాదిగ హాజరై మాట్లాడుతూ ఈ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత మూడు దశాబ్దాల పోరాటంతో సాధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మాదిగ జాతి నోటికాడి ముద్దను దూరం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారే అని తెలిపారు.అందరికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు మాదిగ జాతికి ద్రోహం చేస్తూ మాలల కుట్రలకు, మాలల వత్తిల్లకు లొంగి వర్గీకరణ లేకుండా ఫలితాలను ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరాహార దీక్షలకు సంఘీభావంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు మద్దతు తెలిపి ఎమ్మార్పీఎస్ నాయకులకు పూలమాలవేసి దీక్షలు కూర్చున్నారు ఈ సందర్భంగా పలువురు తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు భారీ అశోక్, కోల కరుణాకర్ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు, జటంగి సతీష్ యువజన బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గ్రూప్1,గ్రూప్2,గ్రూప్3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మిగతా అన్ని ఉద్యోగ ఫలితాలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.వర్గీకరణ లేకుండా ఉద్యోగ భర్తీ చేయడం వల్ల డీఎస్సీ ఫలితాలలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది, నేడు గ్రూప్స్ మిగతా ఉద్యోగాలలో కూడా వర్గీకరణ లేని ఫలితాలతో అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఉద్యోగాలు భర్తీ పూర్తయ్యాక వర్గీకరణ జరిగిన మాదిగ జాతికి అందే ఫలితం శూన్యం అవుతుందన్నారు.తక్షణమే ఉద్యోగ భర్తీ ఫలితాలను నిలుపుదల చేసి వర్గీకరణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.నియోజకవర్గ ఇన్చార్జ్ ములకలపల్లి రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి మిరియాల చిన్ని మాదిగ, ఇరుగు యాదయ్య మాదిగ, ములకలపల్లి సైదులు మాదిగ, మహేష్ మాదిగ,శీను మాదిగ, ప్రియదర్శిని మాదిగ, రాములు మాదిగ, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు