*హైడ్రా లాగా* మా కోదాడ నియోజకవర్గంలో కూడా కావాలి. సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహన్ కృష్ణ
కోదాడ.20-09-2024. శ్రీయుత A. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, N.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మాత్యులు, N.పద్మావతి రెడ్డి కోదాడ శాసన సభ్యులు గార్లకు.
ఆర్యా
కోదాడమున్సిపాలిటీ పరిధిలోని R&B రోడ్ క్రాస్ చేస్తూ ప్రవహిస్తున్న ఉలక వాగు (హుజూర్నగర్ రోడ్ ) 50 అడుగుల పొడవుతో ఆరు పెద్ద పెద్ద కానాలతో ఉన్న బ్రిడ్జ్ కి ఇరువైపులా పక్కా నిర్మాణాలకు చేసి వాగు ప్రవాహానికి 10 అడుగులు మాత్రమే వదిలినారు. మొన్న వచ్చిన వాన, వరదలకు నీరు పోవుటకు దారి లేక రోడ్డుపై నుండి వరద పోతు రోడ్డుపై ప్రయాణిస్తున్న రెండు కార్లు కొట్టుకొని పోయి ఇద్దరు చనిపోవడం జరిగినది. వాగు ఉధృతంగా ప్రవహించేటవల్ల ఆక్రమణంలోని కొన్ని నిర్మాణాలు కొట్టుకొని పోగా వాటిని పునర్నిర్మాణం చేయుటలో భాగముగా ఉన్న పది అడుగుల వాగును కూడా పూడ్చి నిర్మాణాలు చేస్తున్నా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వారు కానీ, R&B అధికారులు కానీ పట్టించుకోనుటలేదు. వంతెనకు పడమర పక్కన యాపిల్ హాస్పిటల్ మరియొక బిల్డింగు,మున్సిపాలిటీ 2 రోడ్లు నాళాలకు అడ్డంగా నిర్మాణము చేసినవే ఈ విధముగా 90% నాళాలు ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేయుయే గాక, నాళాలకు బిల్డింగ్స్ కు మధ్యన పాసింగ్ రోడ్డు నిర్మాణం చేసి ఉన్నది. ఇవి అన్ని అడ్డు ఉండటం వలన మరియు తూర్పు పక్కన కూడా నాళాలను 90% ఆక్రమించి నిర్మాణాలు చేయుట వల్ల 2 కార్లు కొట్టుకుపోయి" ఇద్దరు చనిపోవడం" జరిగినది. నేడు తూర్పు పక్కన కొట్టుకుపోయిన నిర్మాణాలు మరలా నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
ఉలక వాగు నాళాలను ఆక్రమించి మరల నిర్మాణాలు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా మా టౌన్ ప్లానింగ్ అధికారి వెళ్లి అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయగా వారు ఇరిగేషన్ శాఖ వారిచ్చిన NOC చూపించినారని అందువల్ల ఏమీ చేయలేమని చెప్పి తప్పించుకొనుట జరిగినది.
ఆ రోడ్డు 100 అడుగులు ఉండగా, తార్ రోడ్డ ఉన్న 50 అడుగులు మాత్రమే R&B వారి ఆధీనంలో ఉన్నది మిగిలిన దానిని పడమర వైపు యాపిల్ హాస్పటల్ పక్క నిర్మాణాలు చేసిన వారు ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలకు మున్సిపాలిటీ వారు రోడ్డుగా ఏర్పాటు చేసి 75% నాళాలు మూసివేయుటకు, తూర్పున నాళాలకు అడ్డంగా 25% ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేయుటకు R&B వారు సంపూర్ణ సహకారం అందించినారు. వాగు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడవలసిన ఇరిగేషన్ శాఖ వారు మున్సిపాలిటీ వారు గృహ నిర్మాణాలకు ఆన్లైన్లో ఇచ్చు పర్మిషన్లకు NOC ఇచ్చేది ఇరిగేషన్ అధికారులు. గుడ్డెద్దు చేలో పడినట్లు మూడు శాఖల అధికారులు పర్మిషన్లు ఇచ్చి నాళాలకు అడ్డంగా నిర్మాణాలు చేయించుట క్షమించరాని నేరము.
N. పద్మావతి రెడ్డి గారు అన్ని శాఖల అధికారులు పట్టణం మొత్తం కలియతిలిగి వాన, వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం తగు సహాయం చేస్తుందని," నాళాల ఆక్రమణలు తొలగిస్తామని హామీ" ఇచ్చి కొన్ని గంటలు గడవకుండానే నాళాల ఆక్రమణ జరుగుతున్న ఒక్క శాఖ అధికారి కూడా స్పందించుటలేదు. నాళాలలో అడ్డంపడిన చెత్తా,చెదారం ఈరోజు వరకు తొలగించలేదు.
చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుండి కాపాడవలసిన "టాస్క్ ఫోర్స్" కమిటీలోని అధికారులకు వాన, వరదలకు గురి అయిన పట్టణ ప్రజల రక్షణ కొరకు ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాడ్ రిలీఫ్ ఫండ్ నిధులను మున్సిపాలిటీ, R&B అధికారులు జెసిబి లు, ట్రాక్టర్లు పెట్టి నీటి నిల్వలను తొలగిస్తున్నాము, కొట్టుకుపోయిన రోడ్ల పై మట్టితోలుట చేస్తున్నాము, వాగులు పూడిక తీస్తున్నాము అని జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు నిధుల ఖర్చు వివరాలు పంపిస్తున్నారు. 50 అడుగులు ఉన్న వాగులో 10 అడుగుల మేర పనిచేసినచో మిగిలి 40 అడుగులు ఆక్రమించుకోవచ్చు అని ప్రజల భావిస్తున్నారు. వాగులలో కూడిక తీసిన దాఖలాలు లేకుండానే బిల్లులు చేస్తున్నారు. మున్సిపాలిటీ వారు 10 అడుగుల వాగులో తీసిన మట్టి పోయడానికి బఫర్ జోన్ లేక జెసిబి లు బకెట్ తో వాగులో ఉన్న చెత్తా,చెదారాన్ని అటు,ఇటు తోస్తు ఎలాంటి పూడిక తీయకుండానే పని పూర్తి చేసినారు. యాపిల్ హాస్పిటల్ నుండి NH9 వరకు,అక్కడ నుండి స్మశాన వాటిక వరకు, స్మశాన వాటిక నుండి ఖమ్మం క్రాస్ రోడ్ వరకు ఇరువైపులా పక్కా నిర్మాణాలు ఉన్నాయి.
ఈ విధంగా పన్ను చెల్లింపుదారుల నిధులను దుర్వినియోగం చేస్తున్న అన్ని శాఖల అధికారులపై చట్టప్రకార చర్యలు గైకొని వాన, వరదల వల్ల నష్టపోయిన కాలనీలలో ఉన్న నాళాలు, హుజూర్నగర్ రోడ్, ఖమ్మం, మేళ్లచెరువు రోడ్ విజయవాడ, హైదరాబాద్ రోడ్డు లలో ఉన్న రోడ్ క్రాస్ నాళాలలో ఉన్న చెత్తాచెదారాన్ని వెంటనే శుభ్రపరిచి భవిష్యత్తులో వాన , వరదల వల్ల పట్టణానికి ఎలాంటి నష్టం జరగకుండా హైదరాబాదులో ఏర్పాటు చేసిన "హైడ్రా లాగా" మా నియోజకవర్గంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి చెరువులలో, నాళాలలో,ప్రభుత్వ స్థలాలలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నిటిని వెంటనే తొలగించాలని మా డిమాండ్.
కుదరవల్లి మోహన్ కృష్ణ.
సెల్: 9490128449.
దీనితో కొన్ని ఫోటోలు, వీడియోలు.