హైకోర్టు తీర్పుని కబ్జాదారుల కై తిరగేసి వ్రాసి అమలుపరిచిన కలెక్టర్

Oct 16, 2024 - 17:25
Oct 16, 2024 - 17:49
 0  156
హైకోర్టు తీర్పుని కబ్జాదారుల కై  తిరగేసి వ్రాసి అమలుపరిచిన కలెక్టర్

హై కోర్టు తీర్పుని కబ్జాదారుకై

తిరగేసి వ్రాసి అమలు పర్చిన కలెక్టర్లు

కోదాడ పాత NH9 పై నున్న సర్వే నం.149లో య.2-00ని 1963లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం కొరకు దానపత్రం ద్వారా ఇవ్వబడింది. 50 సం. తర్వాత పట్టేదారు వారసుడు తన భూమిని హాస్పిటల్ కబ్జా చేసిందని సర్వే చేపించాలని హై కోర్టుకి వెళ్ళాడు. హై కోర్టు హాస్పిటల్ ఆక్యుపేషన్లో య.2-00 కంటే ఎక్కువ వుంటే తిరిగి ఇమ్మని ఆదేశిస్తే, అది రెవెన్యూ శాఖ అధికార్లకు వరమై కోర్టు తీర్పుని ఫిర్యాయదీకి అనుకూలంగా తిరగేసి వ్రాసి అమలు పర్చారు. 

కలెక్టర్ గారు హాస్పిటల్ ఆక్యుపేషన్లోని స్థలాన్ని కొలిసి నివేదిక ఇమ్మని సర్వే అధికారిని ఆదేశించారు. హాస్పిటల్ ఆక్యుపేషన్లో కొలిస్తే య.1-30 కుం. లే ఉంది కనుక హాస్పిటల్ కాంపౌండ్ బయట పట్టేదారే రిజిస్టర్ సేల్ డీడ్ తో అమ్మిన రోడ్, రోడ్ పై కట్టిన ఇళ్లు కలిపి కొలిసి 530 చ.గ. ఎక్కువ వుందని నివేదించారు. బాధ్యత గల కలెక్టర్ గారు తాను ఆదేశించినట్లు కొలవకున్నా ప్రొ.నం. ఇ2/7254/2003 తేది 16-09-2003తో 530 చ.గ. అప్పగించారు. 

వైధ్య విధాన పరిషత్ కమిషనర్ హైదరాబాద్ గారి DO లెటర్ లో మిస్ కన్ సెప్షన్ (misconception) తో సర్వే చేశారని, హాస్పిటల్ కాంపౌండ్ లో కొలవాలని ప్రొ. రద్దు చేయాలని కోరారు. దాని ప్రకారం హాస్పిటల్ కాంపౌండ్ లో య.2-00 కి బదులు 1-30 కుం. లే ఉందని ఇచ్చిన ప్రొసీడింగ్ రద్దు చేశారు. కలెక్టర్ ప్రొసీడింగ్ రద్దు చేయటాన్ని అంగీరించనని కబ్జాదారు కోర్టులో మరో రిట్ వేశాడు. అది పెండింగ్ లో ఉండగానే, 14-2-2012న సదరు స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకొంటానని దరఖాస్తు చేసుకుంటే, JC గారు మళ్ళీ హాస్పిటల్ ఆక్యుపేషన్లోని స్థలం కొలిసి నివేదిక ఇవ్వాలనే తంతుగా, హాస్పిటల్ కాంపౌండ్లో య.1-30 కుం.లే వుంది, రోడ్లు కలిపి కొలిస్తే 565 చ.గ. ఎక్కువ ఉందని నివేదిస్తే, ఈ కలెక్టర్ గారు కూడా పై మాదిరిగానే కాకుండా విచిత్రంగా, ఫిర్యాది కోర్టులో వేసిన కేసు ఉపసంహరించుకునే షరతుతో ప్రొ.నం.ఇ2/7254/2003 తేది 19-62024తో 500 చ.గ. అప్పగించాలని ఆదేశించారు. 

కానీ ఈ ఆదేశం కాగితానికే పరిమితమై రద్దు చేసిన ప్రొ. ప్రకారం 530 చ.గ. అమలులో ఉన్నట్లు, RDO గారు జిల్లా కలెక్టర్ గారికి నివేదించారు. అసలు సర్వే నం.149 విస్తీర్ణం మొత్తాన్ని ఇద్దరు పట్టేదారు వారసులకు దొంగ పట్టాలు ఇస్తే, వాటిని తాకట్టు పెట్టారన్న MRO నివేదిక బి/769/2022 తేది 9-6-2024 గాని, సర్వే నం.149లో ఇతరుల భూమి లేదని తేల్చిన రాష్ట్ర సర్వే కమిషనర్ రిపోర్టు 2000ని కాని, 149లో మొత్తం భూమిని 1975 నాటికే అమ్ముకున్నాం అని వ్రాసి ఇచ్చిన పట్టేదారు & పట్వారీ స్టేట్మెంట్ గాని, ఇప్పుడు హాస్పిటల్ 100 పడకల పునఃనిర్మాణం య.1-25 కట్టుకోవాలన్న సర్వే రిపోర్టు గాని, తగ్గిన 15 కుం. ఏమైందో చెప్ప లేదని గాని, కోదాడ మున్సిపాలిటీ రోడ్లు హాస్పిటల్ కి చిందినవిగా ప్రొ. ఇచ్చారు గనుక, ప్రజలు రోడ్లు లేక ప్రజా ఆగ్రహానికి గురి అవుతామని కబ్జాదారు నిర్మాణ అనుమతులు తిరస్కరించింది గాని, 10 కుం. తక్కువ ఉన్న హాస్పిటల్ కాంపౌండ్ గేటు లోపల అప్పగించారని కానీ, JC & RDO కమిటీలోని మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్, NSP అధికార్లు వాస్తవాలు ఎందుకు నివేదించలేదో కలెక్టర్ గారికి చెప్పకుండా మోసాగించారని, ఈ నేరంలో కొమ్ముక్కు అయిన అధికార్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే FIR చేయలేదు కనుక SP, కలెక్టర్ సూర్యాపేట గార్లకు FIR చేపించి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని, హాస్పిటల్ య.2-00 లో పునః నిర్మాణం చేయాలని పొడుగు హుస్సేను, సోషల్ యాక్టివిస్టుగా కొరినాను.    

    పొడుగు హుస్సేను, 9110309202 

సోషల్ యాక్టివిస్ట్, కోదాడ

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State