ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరుగుతుంది

Mar 1, 2024 - 20:31
Mar 1, 2024 - 21:27
 0  5
ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెరుగుతుంది

తుంగతుర్తి మర్చి 01 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండలంలోని  రావులపల్లిx రోడ్ తండాలో శుక్రవారం నాడు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ జరిగినట్లు  కే.వి.కే - గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త అండ్ హేడ్  ఇంఛార్జి డి . నరేష్ తెలిపారు,  ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశించి  వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు ఎరువులు మరియు క్రిమిసంహారిక మందులు అధిక మోతాదులో వాడటం వలన ఖర్చు పెరిగి ఆదాయం తగ్గిపోతున్నదని అన్నారు. కావున రైతులు సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం పెంపొందుతుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంతో పండించే పంటకు అధిక ధర కూడా వస్తుందని తెలియజేశారు. కే.వి.కే లో ప్రకృతి వ్యవసాయంపై చేస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల గురించి తెలియజేశారు.

  కే.వి.కే శాస్త్రవేత్త ఎ.కిరణ్ మాట్లాడుతూ సహజ వ్యవసాయంలో పాటించ వలసిన పద్దతులు సేంద్రీయ జీవన ఎరువుల వాడకం లాభాల గురించి వివరించారు. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వల్ల పర్యావరణానికి మేలు కలగడమే కాకుండా రైతులకు రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం ను చాలా వరకు తగ్గించుకోవచ్చు నని  తెలియజేశారు. అదేవిధంగా  ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చు  తగ్గించుకోవచ్చు మరియు నెలసారం పెరుగుతుందన్నారు, పచ్చి రొట్టె ఎరువులు యొక్క ఉపయోగాల గురించి తెలియజేశారు. కే. వి.కే.శాస్త్రవేత్త సి.హెచ్. నరేష్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకం, వేసవి లో వేసుకోవాల్సిన పంటలు గురించి తెలిపారు.

 కే.వి.కే శాస్త్రవేత్త డి. ఆదర్శ్  సమగ్ర సస్యరక్షణలో భాగంగా జిగురు అట్టలు, లింగాకర్షణ బుట్టలు మరియు దీపపు ఎరలు గురించి తెలిపారు. వివిధ రకాల కషాయాల ద్రావణుల తయారీ విధానం మరియు వాడకంను తెలిపారు.  వి.స్రవంతి  తుంగతుర్తి మండల ఉద్యాన అధికారిని మాట్లాడుతూ ఉద్యాన విభాగం సబ్సిడీ సంబంధించి మరియు ఆయిల్ పామ్ సబ్సిడీ గురించి మామిడి తోటల్లో యజమాన్య పద్ధతులను  వివరించారు.  సిహేచ్. శ్రీజన వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రస్తుతం వరిలో తీసుకోవాల్సిన యజమాన్య పద్ధతుల గురించి వివరించారు కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు  డి.నరేష్, ch. నరేష్,డి ఆదర్శ్, ఎ.కిరణ్. వి.స్రవంతి, తుంగతుర్తి మండల ఉద్యాన అధికారిని మరియు సిహేచ్. శ్రీజన వ్యవసాయ విస్తరణ అధికారిని  మరియు  45  రైతులు తదితరలు పాల్గొన్నారు. ఫొటో: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమంలొ ఉద్దేశించి మాట్లాడుతున్న సీనియర్ శాస్త్రవేత్త అండ్ హేడ్ ఇంఛార్జి డి.నరేష్.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.