హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు
హెల్మెట్ వాడాలని సూచిస్తున్న ట్రాఫిక్ ఎస్సై
జోగులాంబ గద్వాల 9 జనవరి2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- గద్వాల ప్రాణాలను రక్షణ కవచం లాంటి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనవారులను ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు కోరారు.గురువారం ఇటిక్యాల మండలం కోదండపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పూటన్ దొడ్డి గ్రామం లో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా స్థానిక ఎస్‌ఐ స్వాతి తో కలిసి గ్రామ ప్రజలకు,వాహన దారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ హెల్మె ట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలను నడపడం నేరమని దీనిని అతిక్రమిస్తే రూ.10వేల జరిమానా తప్పదని హెచ్చరిం చారు.ప్రమాదాల నివారణకు ప్రజలంతా రహదారి భద్రత పాటించాలని సూచించారు. విద్యార్థులు వేగ నియంత్రణతో వాహనాలు నడిపితే రహదారి ప్రమాదాల నివారణ జరుగుతుందన్నారు. వాహనాలు నడిపినప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు.ట్రాఫిక్ సిబంది శివ కుమార్ పాల్గొన్నారు.