సాగునీటి విడుదల కొరకు ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే విజయుడు 

Jan 9, 2025 - 19:31
 0  1
సాగునీటి విడుదల కొరకు ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే విజయుడు 

ఏపీ నుండి సాగునీటిని విడుదల చేయించి అల్లంపూర్ చివరి ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వినతి.

సానుకూలంగా స్పందించిన మంత్రి ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి న్యాయం చేస్తానన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

జోగులాంబ గద్వాల తొమ్మిది జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :-

అలంపూర్ నెట్టెంపాడు రిజర్వాయర్ పనులు 99,100, 106కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరిన ఎమ్మెల్యే. ఆర్డీఎస్ D12 నుండి  D40 చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరిన ఎమ్మెల్యే.  తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అల్లంపూర్ నియోజకవర్గంకు సాగునీటి విడుదలకై గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు అల్లంపూర్ నియోజకవర్గం లోని రైతులు రెండో పంట సాగు చేశారు. పంట చివరి దశలో ఉన్న తరుణంలో తుంగభద్రా నదిలో నీరు అడుగంటి పోయింది. దీంతో ఆర్డీఎస్ మరియు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల మోటర్ పంపులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతం వారం రోజుల నుండి ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు తుంగభద్ర డ్యామ్ అధికారులతో ఇరిగేషన్ శాఖ అధికారులతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఆర్డీఎస్ కు రావాల్సిన రెండో ఇండెంట్ లో ఒక్క టీఎంసీ  సాగునీటిని విడుదల చేయాలని కోరడం జరిగిందని ఎమ్మెల్యే విజయుడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి మరియు ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర డ్యామ్ నుండి తెలంగాణకు మరియు ఏపీకి రావలసిన సాగునీటిని త్వరగా విడుదల చేయించే విధంగా చూడాలని ఎమ్మెల్యే విజయుడు వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే నెట్టెంపాడు రిజర్వాయర్ పనుల్లో భాగంగా 99 100 106 కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు అనుసంధానం చేయాలి. అలాగే తుమ్మిళ్ల లేపు ఇరిగేషన్ మల్లమ్మ కుంట పనులకు టెండర్లు పూర్తి అయిన పనులు ప్రారంభం కాకపోవడం వల్ల అల్లంపూర్ రైతాంగానికి సాగునీటి కష్టాలు ఉన్నాయి. కావున త్వరగా మల్లమ్మ కుంట రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు. సానుకూలంగా స్పందించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఏపీ ప్రభుత్వం ఆ శాఖ మంత్రులతో అధికారులతో మాట్లాడి త్వరగా సాగునీటిని విడుదల చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యేకు మంత్రి హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333