ప్రజల అభిప్రాయాలు మా కెంతో విలువైనవి
ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ IPS
జోగులాంబ గద్వాల జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- గద్వాల జిల్లాలోని ఆయా సమస్యల పై పోలీస్ స్టేషన్ కు, సర్కిల్ కార్యాలయాలకు వచ్చే వారు పోలీస్ సేవల గురించి ఇచ్చే అభిప్రాయం మా కెంతో విలువైనవి అనీ, అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ జితేందర్, ఐపీఎస్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి డిజిపి ఆఫీసు నుండి నూతనంగా తయారుచేసిన క్యూఆర్ కోడ్ ను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించగా అందుకు సంబంధించిన పోస్టర్స్ ను జిల్లా ఎస్పి తన ఛాంబర్ లో విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ యందు, సర్కిల్ కార్యాలయాలు, డి .ఎస్పి ఆఫీసు, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు దారులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు , పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు ఏ విధంగా తమ అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నరో వారి అభిప్రాయాలను సేకరించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందిని అన్నారు. ఈ QRకోడ్ పోస్టర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాల్లో, డి .ఎస్పి ఆఫీసులో, ఐదు ప్రదేశాలలో రిసెప్షన్, పోలీస్ స్టేషన్ ముందు బాగాన ప్రజలకు విజబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందనీ అన్నారు.
ప్రజలు వారి అభిప్రాయాలు ఫీడ్ బ్యాక్/ తెలియజేసే అంశాలు
ఫిర్యాదులు/ పిటిషన్
ఎఫ్ఐఆర్ /ఫైర్
ఈ చాలన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు
పాస్ పోర్ట్ ధ్రువీకరణ
ఇతర అంశములు
పై అంశాలపై QR కోడ్ (https://qr.me-qr.com/aZMTxHDm) స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలి. రేటింగ్ ఇవ్వవచ్చు జిల్లా ప్రజలు ఈ QR కోడ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి కోరారు.
ఈ కార్యక్రమంలో డి .ఎస్పి శ్రీ వై.మొగిలయ్య , ఎస్బి ఇనస్పెక్టర్ నాగేశ్వర రెడ్డి, గద్వాల్ సిఐ టి.శ్రీను, ఎస్బి ఎస్సై శ్రీనివాస్, డిసి ఆర్బీ ఎస్సై రజిత పాల్గొన్నారు