హామిల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని, వందరోజుల్లో అమలు చేస్తామని చెప్పి హామీలను వెయ్యి రోజులు అయినప్పటికీ అమలు చేయలేదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిద్రలో కూడ కెసిఆర్ పేరు కల వరిస్తున్నాడని, కెసిఆర్ పేరు పలకకుండా ఆయన ఉండడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారంటిలు, 420 హామీలు అమలు చేయనందు కు నిరసనగా సెప్టెంబర్ రెండో తారీఖునుండి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆగస్టు మూడవ తేదీన మిర్యాలగూడలో జరిగే రైతు మహాదర్న కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు అవుతారని ఆయన చెప్పారు. ఆంద్ర ప్రభుత్వం జలదోపిడికి పాల్పడుతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని , నల్గొండ పాలమూరు జిల్లాలకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు నీళ్లు తరలిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వలిగొండప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడం లేదని , దీనివలన నల్గొండ పాలమూరు జిల్లాలొై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , పార్టీ నాయకులు ఉప్పల ఆనంద్, గుర్రం సత్యనారాయణరెడ్డి, జీడి బిక్షం, నెమ్మాది బిక్షం పలువురు నాయకులు పాల్గొన్నారు