కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ములుగు గడ్డపై నేడే భారీ ర్యాలీ
సైనికుల వలె కదలి రావాలి కార్యకర్తలు
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, సెప్టెంబర్ : 01 : కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు హామీలను మోసాలను ఎండగట్టడానికి ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ములుగు గడ్డపై నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో ములుగు కూడా హాజరై విజయవంతం చేయాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కార్యక్రమ వివరాలు నేడు సమయం ఉదయం 10:00 గంటలకు ప్రారంభ స్థలం బి.ఎల్.ఆర్ గార్డెన్ నుండి ములుగు ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ ఉంటుందని జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చాలా అమలు శూన్యం దీనంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు శర్మ గీతం బుద్ధి చెప్పేందుకు ప్రతీ ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త సైనికుడు వాలే కదలి రావాలని జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కార్యకర్తలను కోరారు.ములుగు గడ్డ నుంచే మార్పు మొదలుపెడదామని మన భవిష్యత్తు కోసం టిఆర్ఎస్ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అందరం కలిసి పోరాడుదామని లక్ష్మణ్ బాబు టిఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి మాజీ ఎంపీపీ వినయ్ కుమార్ మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవిందు నాయక్ మల్క రమేష్ తుమ్మ మల్లారెడ్డి కర్రీ రవీందర్ ఓదెల్ మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.