ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయండి
అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సెప్టెంబర్ 8,9,10వ తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బెల్లి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అడ్డగూడూరు మండల కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బెల్లి శ్రీకాంత్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్,పోచంపల్లి, బీబీనగర్,భువనగిరి ప్రాంతాలలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన యువజన ప్రతినిధులు హాజరవుతారని,యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బెల్లి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్,రైతు సంఘం మండల కార్యదర్శి బోనుగ సుదర్శన్ రెడ్డి,ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షులు భాషబోయిన మల్లేష్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మందుల నవీన్, ఉదయ్, సురేష్, సంజయ్ యువజన నాయకులు బాలెమల నరేష్ తదితరులు పాల్గొన్నారు.