సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణే ఉద్యోగుల ప్రధాన డిమాండ్

Sep 1, 2026 - 19:38
 0  1
సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణే ఉద్యోగుల ప్రధాన డిమాండ్

సూర్యాపేట...   రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ వైస్ చైర్మన్* బి పాండు* అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. గత ప్రభుత్వ సెప్టెంబర్ 1, 2004న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  సీపీఎస్ అమలై 22 సంవత్సరాలు పూర్తయిన కూడా ఓపీఎస్ పునరుద్ధరించక పోవడంతో  జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ’ హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నవంబర్ 17వ తేదీని ‘మేనిఫెస్టో డే’గా పాటిస్తూ, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఉద్యోగి,  భాగస్వామి కావాలని వారు కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ భూపతి వెంకటయ్య, జేఏసీ పబ్లిసిటీ సెక్రటరీ నందిపాటి రవి, టిఎన్జీవో అర్బన్ ప్రెసిడెంట్ అల్లి సతీష్, డైస విద్యా సుమన్, రవి కిరణ్ భాస్కర్ శ్రీను రవి కిషన్ రాజకుమారి ఎన్ టి పి ఏ, ఎన్ టి పి ఏ కార్యాలయ సిబ్బంది ఎస్సీ కార్యాలయ సిబ్బంది పీఏఓ కార్యాల సిబ్బందిసీపీఎస్ రద్దు – పాత పెన్షన్ పునరుద్ధరణే ఉద్యోగుల ప్రధాన డిమాండ్

సూర్యాపేట... 
 రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ వైస్ చైర్మన్* బి పాండు* అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద వారు మాట్లాడారు. గత ప్రభుత్వఓ సెప్టెంబర్ 1, 2004న పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్ సామాజిక భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  సీపీఎస్ అమలై 22 సంవత్సరాలు పూర్తయిన కూడా ఓపీఎస్ పునరుద్ధరించక పోవడంతో  జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు, నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరై, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సీపీఎస్ రద్దు – పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ’ హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నవంబర్ 17వ తేదీని ‘మేనిఫెస్టో డే’గా పాటిస్తూ, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఉద్యోగి,  భాగస్వామి కావాలని వారు కోరారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ భూపతి వెంకటయ్య, జేఏసీ పబ్లిసిటీ సెక్రటరీ నందిపాటి రవి, టిఎన్జీవో అర్బన్ ప్రెసిడెంట్ అల్లి సతీష్, డైస విద్యా సుమన్, రవి కిరణ్ భాస్కర్ శ్రీను రవి కిషన్ రాజకుమారి ఎన్ టి పి ఏ, ఎన్ టి పి ఏ కార్యాలయ సిబ్బంది ఎస్సీ కార్యాలయ సిబ్బంది పీఏఓ కార్యాల సిబ్బందిCE కార్యాలయ సిబ్బంది, SE కార్యాలయ సిబ్బంది, APAO,కార్యాలయ సిబ్బంది.    DCE విద్య సుమన్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333