సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Sep 1, 2026 - 19:36
 0  0
సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సైబర్ మోసాల బారిన పడ్డ బాధితులకు అండగా పోలీస్: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సైబర్ వారియర్ సిబ్బంది ఒకరోజు శిక్షణ, జిల్లా ఎస్పీ ప్రత్యేక సమీక్ష 

బాధితులకు తక్షణ సహాయం అందించి, పోగొట్టుకున్న డబ్బు రికవరీ చేయడమే లక్ష్యం

జిల్లా లోని పోలీస్ స్టేషన్ ల నందు పని చేస్తున్న పోలీస్ సైబర్ వారియర్ సిబ్బందికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ప్రత్యేక శిక్షణా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై సైబర్ వారియర్స్ కు సలహాలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సైబర్ మోసాలు నియంత్రణ, రిఫండ్ చేయడంలో జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా సైబర్ సెక్యూరిటీ వింగ్ పని చేస్తుంది అన్నారు.  సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు తక్షణ సహాయం అందించి, వారికి పోలీస్ అండగా ఉంటుందని, పోగొట్టుకున్న డబ్బును త్వరగా రికవరీ చేసి బాధితులకు అందేలా సైబర్ వారియర్స్ వేగంగా కృషి చేస్తున్నారు అని తెలిపినారు. సైబర్ వారియర్ పోలీసు సిబ్బంది బాధితుల పిర్యాదుల పై స్పందించి కేసులు నమోదు చేయడం, నిందితుల, బాధితుల అకౌంట్స్ ను రికార్డు చేయడం, లింక్ లు నమోదు చేయాలని సూచించారు. బ్యాంక్ అధికారులు, కోర్టు అధికారులతో సమన్వయంగా పని చేసి త్వరగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 

ఆన్లైన్ పెట్టుబడులు అంతా ట్రాష్ అని ప్రజలుంగ్రహించాలి, ఆన్లైన్ పెట్టుబడులకు ఎలాంటి రక్షణ ఉండదు. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందనేది పూర్తిగా అవాస్తవం అన్నారు, అలాంటి వెబ్‌సైట్లు, యాప్‌లు అన్నీ నకిలీవి (ట్రాష్) అని ప్రజలు గ్రహించాలి అని కోరారు. ప్రజలు ఎవరూ కూడా ఆన్లైన్ పెట్టుబడి గేమ్స్ ఆడవద్దు. అత్యాశకు పోయి రక్షణ లేని ఆన్లైన్ మార్గాలలో పెట్టుబడులు పెట్టకూడదు అని సూచించారు. ఇలాంటి మార్గాల్లో సైబర్ మోసగాళ్ళు ప్రజల డబ్బును దొంగిస్తున్నారు అన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను, వారి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేయడం పోలీసుల ప్రాథమిక బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీస్ సైబర్ వారియర్స్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను చైతన్యపరచాలని, ప్రజలకు అత్యాశ, భయం, లోపాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అత్యాశకు పోయి అనుమానాస్పదంగా ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహించి, సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బులు పొందిన వారిపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ద్వారా కేసులు నమోదు చేశాము. ఇలాంటి అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు అని ప్రజలు గ్రహించాలి. అత్యాశ కు పోయి వ్యక్తిగత వివరాలు అపరిచితులు ఇవ్వొద్దు, ఓటిపి, పిన్ వివరాలు తెలపవద్దు. 

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డిసిఆర్బీ డిఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ..., సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, సైబర్ వారియర్ సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333