హనుమాన్ టెంపుల్ కు 30వేల రూ"ఆర్థిక సహాయం సిఐ నర్సింహ గౌడ్
అడ్డగూడూరు13 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ పరిధిలోని(చౌళ్ళగూడెం) హనుమాన్ గుడికి అదే గ్రామానికి చెందిన కుంభం అంజయ్య సావిత్రమ్మ కుమారుడు హైదరాబాదులోని సుల్తాన్ బజార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుంభం నర్సింహ గౌడ్ గ్రామ హనుమాన్ టెంపుల్ కు 30వేలు రూ"ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి,సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. గుడికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన కుటుంబానికి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ ఆంజనేయ స్వామి ఎల్లకాలం చల్లగా చూడాలని కోరుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంటిపల్లి గంగయ్య,కోటమర్తి సోమయ్య,యువకులు గ్రామస్తులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.