జిల్లా వ్యాప్తంగా నెలరోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు

Nov 2, 2024 - 17:47
 0  9
జిల్లా వ్యాప్తంగా నెలరోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-గద్వాల. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం (నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 1 వరకు)30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు శనివారం తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది గద్వాల జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజా ధనానికి నష్టం కలిగించే,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు.అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.లౌడ్ స్పీకర్లు,డీజే ల ద్వారా సందేశాలు ఇవ్వడం, మైకులు వినియోగించడం, ఏదైనా సంస్థలు వాహనాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం లేదా హారన్ల ను వినియోగించడం నిషిద్ధమని వెల్లడించారు.ఎవరైనా పై నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లయితే 1861 పోలీస్ చట్టం ప్రకారం శిక్ష అర్హులవుతారని ఎస్పీ తెలిపారు. అయితే పై నిషేధాజ్ఞలనుండి విధులలో ఉన్న పోలీసు అధికారులు ,మిలిటరీ లో పని చేసేవారు, హోంగార్డులు, ముందస్తు అనుమతి పొందిన అంతిమయాత్ర ర్యాలీలకు మినహాయింపు ఉంటుందనీ , పై ఉత్తర్వులు  ఈ రోజు  నుండి వచ్చే నెల (డిసెంబర్) 1 వ తేదీ సాయంత్రం  6 గంటల వరకు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333