స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలి

స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొండపార్థి బాలచారి

Aug 9, 2024 - 22:23
Aug 9, 2024 - 22:39
 0  15
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరించాలి

అడ్డగూడూరు 09 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల స్వర్ణకారుల సంఘం మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కనగంటి సత్యం ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.అదేవిధంగా జిల్లా స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బాల చారి హాజరై మాట్లాడుతూ..అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామాలలో స్వర్ణకారుల సభ్యులు తమ జీవన ఉపాధి కోసం చిన్నచిన్న పనులు చేసుకొని జీవన ఉపాధిని కొనసాగిస్తున్న క్రమంలో అడ్డగూడూరులో నకిరేకల్ నుంచి వచ్చి అడ్డగూడూరు మండల కేంద్రంలో బంగారం షాపు ఏర్పాటు చేస్తే మండల వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకారులు తమ జీవన ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి విజయలక్ష్మి పాన్ బ్రోకర్ యజమానితో కూడా మాట్లాడిన తర్వాత యజమాని కూడా స్థానిక స్వర్ణకారులను దృష్టిలో పెట్టుకొని తమ షాపును కూడా మూసివేసి వీళ్లకు పూర్తిస్థాయిలో సహకరిస్తానే స్వర్ణకారులకు వాతపూర్వకంగా చెప్పడం జరిగింది.ఎందుకంటే స్వర్ణకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జీవన ఉపాధి కోల్పోయి అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటన కూడా ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.తక్షణమే అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎలాంటి బంగారం షాపులో కూడా అనుమతించబోమని మండల కమిటీలో నిర్ణయించి ఆమోదం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద బంగారం షాపు యాజమాన్యులకు విన్నవించునది ఏమనగా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎలాంటి బంగారు షాపులు కూడా పెట్టొద్దని మిమ్ముల సవినయంగా కోరుకుంటూ మా అందరికీ సహకరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మిమ్ముల కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకోటి సత్యనారాయణ, ఉల్లి వెంకట చారి, మండల అధ్యక్షులు రాజపేట వెంకటరణన చారి,ఉప అధ్యక్షులు తొగటి బ్రహ్మానంద చారి,సహాయ కార్యదర్శి చిత్తోజు లక్ష్మణ చారి,కోశాధికారి శివకోటి వేణు తదితరులు పాల్గొన్నారు*