ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపాలి

Jun 15, 2025 - 17:15
 0  3
ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపాలి మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని జూన్ 17న హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద జరుగు ధర్నాకు ప్రజలు మేధావులు బుద్ధి జీవులు ప్రజాస్వామిక వాదులు కదలి రావాలని స్థానిక ఆత్మకూర్ ఎస్ లో పోస్టర్ ఆవిష్కరణ ఆపరేషన్ కగారి పేరిట కొనసాగిస్తున్న అత్యాకాండను వెంటనే ఆపాలని మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరిపాలని ఆత్మకూర్ ఎస్ లు, తుమ్మల పెన్పాడులో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంక రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట 2024 జనవరి నుండి మావోయిస్టులను అణిచివేసే పేరిట ప్రారంభించిన యుద్ధం ఆదివాసులతోపాటు మావోయిస్టు పార్టీ నాయకులు , కార్యకర్తల అత్యాకాండను కొనసాగిస్తుంది, 17 నెలల్లో చంపేసిన దాదాపు 540 మందిలో మూడో వంతుకు పైగా ఆదివాసులే ఉన్నారు, ఇటీవల కర్రెగుట్టల ప్రాంతాల్ని వేలాదిమంది సాయుధ బలగాలతో చుట్టుముట్టి, 31 మందిని మట్టు పెట్టినట్లుగా ప్రకటించారు, కనీసం చనిపోయిన శవాలను మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి అయినా నంబాల కేశవరావును పట్టుకొని హత్య చేయుట కాక శవాన్ని కూడా వారి కుటుంబాలకు ఇవ్వడానికి నిరాకరించింది, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారును నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఈనెల 17న ఇంద్ర పార్క్ వద్ద జరుగు ధర్నాకు ప్రజలు మేధావులు విద్యార్థులు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దాసరి శీను, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పోరండ్ల దశరథ, సంఘం వీరయ్య, కొరివి అంజయ్య, భూక్య గాంధీ, కొరివి ఎంకన్న, పగిడి ఎల్లయ్య, కేశ బోయిన రాజు, మల్లమ్మ, గుణగంటి శీను తదితరులు పాల్గొన్నారు