సీఎం కప్ పోటీలను ప్రారంభించిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తోపాటు జిల్లా గ్రంథాల చైర్మన్ నీలి శ్రీనివాసులు

Dec 12, 2024 - 18:58
Dec 12, 2024 - 18:59
 0  14
సీఎం కప్ పోటీలను ప్రారంభించిన

జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు మానవపాడు మండల కేంద్రంలో ,సీఎం కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే విజయుడు గురువారం, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు , మానవపాడు మండల ఎంపీడీవో భాస్కర్ , వివిధ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లతో, కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు  మాట్లాడుతూ ...పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్రీడలపై శిక్షణ పొంది జిల్లా రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే అవకాశం ఉన్నది. కావున విద్యార్థులు క్రీడల పై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.  గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల క్రీడా విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయుడు  ను ఉపాధ్యాయులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333