ఆయనకి ఓటు వేస్తే.. నా పెళ్లికి బహుమతి ఇచ్చనట్టే!
సంగారెడ్డి:- పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తుండగా.. తెలంగాణలో వినూత్న ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు పెళ్లి కార్డుపై మోడీ ఫోటో వేసి మరి ప్రచారం చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు తన పెళ్లి ఆహ్వాన పత్రికపై మోడీ ఫోటో ముద్రించి, దాని కింద " నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్రమోదీజీకి మీరు వేసే ఓటు" అంటూ వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అయితే పెళ్లిలో చదివింపులు ఉండవన్నమాట, ఈ జనాల వెర్రి ఎప్పడు తగ్గుతుందో అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.