సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి

జోగులాంబ గద్వాల 18 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఉద్యమ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు.అంతకుముందు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వాహనంపై ర్యాలీగా బయలుదేరి విగ్రహావిష్కరణ స్థలానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత, ఏఐసిసి కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.