సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్ నందు జర్నలిస్ట్ భవన్ ఏర్పాటు చేయాలి... కందుకూరి యాదగిరి
మునగాల 20 ఫిబ్రవరి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
*అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాన్ని 500 గజాల స్థలంలో నిర్మించాలి*
*వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు,హెల్త్ కార్డులు,పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి*
సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో 500 గజాల స్థలాన్ని కేటాయించి అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవన్ ను విలేకరుల కోసం ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ప్రాంతాలలో విలేకరుల ఆత్మగౌరవ భవనాలుగా గుర్తించి జర్నలిస్టు భవనాలు నిర్మించాలన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్బులు లేక జర్నలిస్టులు హోటల్లో ప్రైవేటు భవనాల మెట్ల కింద చెట్లనీడకు సేద దీరుతున్నారని తమ దయనీయమైన పరిస్థితి చూసి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం లేదా ప్రత్యేక ఇండ్లు కట్టి ఇవ్వడం చేయాలని కోరారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచిత సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలోనే కొనసాగుతూ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను గుర్తించి కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.వృత్తిపరంగా పోలీసు వారి నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జర్నలిస్టులకు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ఇంతే కాకుండా తాము గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతిరోజు లీటర్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.తమ సమస్యలన్నీ ప్రభుత్వం వెనువెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు,రాష్ట్ర గౌరవ సలహాదారులు మానుకొండ రాము,రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకల చిరంజీవి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సలహాదారులు అనంతుల శ్రీనివాస్ గౌడ్,సూర్యాపేట పట్టణ కార్యదర్శి తప్సి అనిల్ తదితరులు పాల్గొన్నారు.