సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా ఎస్పి నరసింహ

Apr 3, 2026 - 15:17
Apr 3, 2026 - 15:22
 0  0
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా ఎస్పి నరసింహ
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా ఎస్పి నరసింహ
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా ఎస్పి నరసింహ

సూర్యాపేట, 03 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎస్.పి నరసింహ శుక్రవారం రోజున సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డ్స్ ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న కమాండెంట్ కంట్రోల్స్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధం పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని, రికార్డు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి భరోసా కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుండి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సైబర్ మోసాలు రోడ్డు ప్రమాదాలు మహిళల భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సిబ్బంది అందరూ జట్టుగా పనిచేసే మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఆపరేషన్ రోప్ సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అవగాహన కల్పించాలి అన్నారు. సిబ్బంది అందరూ ఒక జట్టుగా పని చేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

ఎస్పి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ లు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్ నాథ్, శివతేజ, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333