మందుబాబులకు కౌన్సిలింగ్ - పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ 

Jul 2, 2026 - 13:14
Jul 2, 2026 - 13:15
 0  26

జోగులాంబ గద్వాల 2 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌకు లో తేదీ 01.07.2026 నాడు రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఉన్నారు అనే కథనానికి స్పందించారు. గద్వాల పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్.  ఈ సందర్భంగా కృష్ణవేణి చౌక్ లో బుధవారం రోజు రాత్రి బహిరంగంగా మందు సేవించిన వ్యక్తులను స్టేషన్ కి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రధాన రోడ్డుపై మద్యం సేవించినట్లయితే చర్యలు తప్పవని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.  ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో ప్రధాన రోడ్లపై మద్యం సేవించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని  ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State