విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తాం

Jul 5, 2026 - 23:21
Jul 5, 2026 - 23:22
 0  0
విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తాం

సూర్యాపేట,05 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ఉపాధ్యాయులకు త్వరలోనే ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తామని ఉపాధ్యాయ ఎంఎల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత  తూము శ్రీనివాస్ రావు ఉద్యోగ విరమణ సన్మాన సభకు ముఖ్యఅతిధి గా హాజరై ప్రసంగించారు. ఇటీవల ముఖ్యమంత్రి, అధికారులతో సర్వీస్ రూల్స్ విషయమై చర్చించామన్నారు ,  సర్వీస్ రూల్స్ లేకపోడంతో విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీని ద్వారా విద్యా ప్రమాణాలు కుంటు పడుతున్నాయన్నారు. డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్స్, మండల విద్యాశాఖ అధికారులు, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు . లోకల్ బాడీలు అనగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి కాగానే సర్వీస్ రూల్స్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అదేవిధంగా త్రివేణి కన్వెన్షన్ హాల్ లో జరిగిన సూరేపల్లి స్వరూపారాణి  ఉద్యోగ విరమణ అభినందన సభకు హాజరై సన్మానించారు. ఈ సమావేశంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్ రావు ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్ , సభాధ్యక్షులు  దేవరశెట్టి జనార్దన్, ఆడిట్ కమిటీ చైర్మన్  సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ , క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య , క్రమశిక్షణ కమిటీ సభ్యులు కందుకూరి శివశంకర్ , పత్రిక సబ్ ఎడిటర్ ధర్మారపు వెంకటయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దండుగుల యల్లయ్య, సుంకర లింగమూర్తి, గంజి శంకర్, రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అల్లాడి సత్యనారాయణ మండల అధ్యక్షులు వల్లెం శంకర్ ప్రసాద్, షేక్ బషీర్, పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333