జిల్లా రవాణా శాఖ అధికారిని కలిసిన బి.ఆర్.టి.యు జిల్లా పట్టణ ఆటో కార్మిక నాయకులు

Jul 4, 2026 - 23:59
Jul 5, 2026 - 00:04
 0  10
జిల్లా రవాణా శాఖ అధికారిని కలిసిన బి.ఆర్.టి.యు జిల్లా పట్టణ ఆటో కార్మిక నాయకులు
జిల్లా రవాణా శాఖ అధికారిని కలిసిన బి.ఆర్.టి.యు జిల్లా పట్టణ ఆటో కార్మిక నాయకులు

జిల్లా రవాణా శాఖ అధికారిని కలిసిన బి.ఆర్.టి.యు జిల్లా పట్టణ ఆటో కార్మిక నాయకులు 

సూర్యాపేట 04 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :-  జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి ని బి.ఆర్. టీ.యూ ఆటో యూనియన్ జిల్లా, పట్టణ నాయకులు మర్యాదపూర్వకం కలవటం జరిగింది. ఈ సందర్భంగా BRTU ట్రాన్స్పోర్ట్ యూనియన్ రాష్ట్రఉపాధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతు ఆటోలకు సంబంధించిన పర్మిట్, ఫిట్నెస్, లైసెన్స్ మొదలగు అంశాల గురించి చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల భృతి  కింద 12000/-ఇస్తమని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు, ఆటో కార్మికులకు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు అన్నారు, గత ప్రభుత్వం ఆటో టాక్స్  రద్దు మరియు డ్రైవర్ ప్రమాద భీమా 5 " లక్షల పథకం ప్రవేశ పెడితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం డ్రైవర్ ప్రమాద భీమాను తీసివేయటం చాలా బాధాకరం ఆన్నారు, ప్రీ బస్సు కారణంగా ఆటో కార్మికుల జీవనోపాధి భారంగా మారిందన్నారు, మరో వైపు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎక్కడికక్కడ ఆపటం మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారింది అన్నారు. ఆటోలకు సంబందించిన పత్రాల వాలిడిటీని  అనుసరిస్తామని అటు ప్రయాణికులతో మరియు రవాణా అధికారులతో సమన్వయంతో సహకరిస్తామనిన్నారు. అన్నారు ఓ స్కూల్ పంచాయతీ విషయంలో స్కూల్ యాజమాన్యానికి మరియు స్థానిక నాయకులకు వివాదంలో మా ఆటో కార్మికులను లాగటం చాలా దుర్మార్గం ఇలాంటి సంఘటన పునవృతం అయితే సాహించిదే లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో BRTU ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కుర్రి సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అహ్మద్, జిల్లా ఉపాధ్యకులు గుండె వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ పెరమళ్ళ లింగయ్య, పట్టణ అధ్యక్షులు ఖుషి వెంకన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ శ్రీను పట్టణ  ఉపాధ్యకులు భూక్య నరేష్ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333