గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

Apr 3, 2026 - 13:50
Apr 3, 2026 - 14:02
 0  7
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

ప్రతీ రైతు పశువులకు టీకాలు వేయించాలి

మండల పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్

గుండాల 03 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ అన్నారు,గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు,కార్యక్రమంలో భాగంగా సుమారు 350 పశువులకు టీకాలు వేయడం జరిగింది అని తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రణమల్ల అనిత శ్రీనివాస్ రెడ్డి ఉపసర్పంచ్ మట్టగజం మల్లేశ్ వెటర్నరీ అసిస్టెంట్ రాజు గోపాలమిత్రలు గోవిందు,కృష్ణ ,నరేష్,శ్రీను,సోమశేఖర్ మరియు రైతులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి