సూర్యాపేటలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్

Jul 5, 2026 - 23:39
 0  6
సూర్యాపేటలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగురవేసే బాధ్యత నాది

గంజాయి మొక్కను కూకటి వేళ్ళతో పీకేస్తాం

సమర్థవంతమైన నాయకుల కార్యకర్తల ముందుకు వచ్చారు 

పార్టీ ఇచ్చే ప్రతి ఆదేశాన్ని తూచా తప్పకుండా పూర్తి చేయాలి

* ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.

మా తాత ముత్తాతల నుంచి నాన్నతో సహా నాలుగవతరమైన నేను కూడా కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ పార్టీ పటిష్టత కోసం ఎంత దూరమైనా వెళతానని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

ఇటీవల నూతనంగా నియామకమైన సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చివేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షుడు ముసుగు రామచంద్రారెడ్డి, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు తుముల సురేష్ రావు ఏఐసీసీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడారు. 

చిన్నచిన్న పొరపాట్ల వల్ల గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోల్పోవడం జరిగిందని తర్వాత జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ ఇచ్చామన్నారు. 

సూర్యాపేటలో మూడు రంగుల కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే మనందరి లక్ష్యమన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి మంత్రులు చెప్పినట్లుగా తులసివనంలో గంజాయి మొక్క ఉందని దాన్ని కూకటివేళ్లతో పెకిలించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. 

నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సమర్థవంతంగా పనిచేసే నాయకులతో కమిటీ మీ ముందుకు వచ్చిందని సామాజిక న్యాయం కోణంలో కూడా ఆలోచించి ఏ కమిటీని ఎన్నిక చేయడం జరిగిందన్నారు. 

సూర్యాపేట నియోజకవర్గంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఉందని వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో తాను ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమన్నారు. ప్రస్తుతం సార్ ప్రక్రియ ఎనిమరేషన్ జరుగుతుందని నాయకులు కార్యకర్తలు వచ్చే నెల రోజులు పార్టీ ఏ ఆదేశించిన సమర్థవంతంగా పనిచేసే పూర్తి చేయాలన్నారు. 

పదవుల కోసం సీనియర్ నాయకులు కూడా పోటీ పడ్డారని పదవులు రాలేదని బాధపడవద్దని ఇంకా చాలా పదవులు ఉన్నాయని పార్టీ కోసం పని చేసే వారిని గుర్తించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333