సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ

Jul 3, 2026 - 14:40
Jul 3, 2026 - 14:42
 0  0
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నాఖాబందీ

గురువారం రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు తనిఖీలు,, తనిఖీల్లో విధులు నిర్వర్తించిన 100 మందికి పైగా పోలీస్.

పట్టణంలోని వచ్చిపోయే మార్గాలు, ప్రధాన కూడళ్లలో ఏకకాలంలో 15 చోట్ల విస్తృత తనిఖీలు

70 కి పైగా వాహనాలు సీజ్.

వాహనదారులకు రక్షణ, భద్రత అంశాల గురించి అవగాహన కల్పించిన డీఎస్పీ ప్రసన్నకుమార్.

సూర్యాపేట 03 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం రాత్రి సమయంలో ఆకస్మికంగా జిల్లా కేంద్రాన్ని నాఖాబందీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ అధ్వర్యంలో, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పర్యవేక్షణలో ప్రధాన జంక్షన్లు, పట్టణం లోకి వచ్చిపోయే అన్ని మార్గాలూ మొత్తం 15 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డిఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాలతో భద్రత రక్షణ చర్యల్లో భాగంగా తనిఖీలు చేశాము, ఈ తనిఖీల్లో 100 కు పైగా పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించారు. తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను ఆపి వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. 70 కి పైగా ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 4 ఇతర అవహనాలు సీజ్ చేయడం జరిగినది అన్నారు. నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా, చోరీ వాహనాల గుర్తింపు, అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా ఈ నాకాబందీ చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల ద్వారా ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, ప్రమాదాలు నిర్మూలించడం లక్ష్యం అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యం చేసుకోవాలని అన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, నాగారం సిఐ నాగేశ్వరావు, తుంగతుర్తి సిఐ ఉపేందర్ రావు, డివిజన్ ఎస్ఐ లు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333