భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు రెవరెండ్ ఫాదర్ కస్పారెడ్డి 

Apr 3, 2026 - 15:18
Apr 3, 2026 - 15:22
 0  0
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు రెవరెండ్ ఫాదర్ కస్పారెడ్డి 
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు రెవరెండ్ ఫాదర్ కస్పారెడ్డి 

సూర్యాపేట, 03 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రేమ కరుణ సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువు అని సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) సందర్భంగా శుక్రవారం సూర్యాపేట లోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో సిలువ దారి ఏసుక్రీస్తు చివరి రోజులను నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని నిర్మల చర్చ వద్ద ప్రారంభమైన  పరిశుద్ధ సిలువ మార్గం కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్, గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ నుండి నిర్మల ఆసుపత్రిలోని  కల్వరికొండ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన 14 గుర్తులను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కస్పారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ మానవాళిని పాపముల నుండి విముక్తులు చేసేందుకు క్రీస్తు ప్రభువు సిలువపై మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పాపాల నుండి విముక్తులు కావాలని సూచించారు. ఏసుప్రభువు కల్మషం లేకుండా జీవించి శారీరకంగా మరణించినా తిరిగి పునరుత్థానుడయ్యారని తెలిపారు. ప్రజలు యేసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ తోటి వారి పట్ల ప్రేమానురాగాలను కలిగి, క్షమాగుణం ఆప్యాయత అనురాగాలను కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలను త్యజించి ప్రభు చూపించిన సన్మార్గం  మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం ఆర్.సి.యం చర్చిలో సిలువ ముద్దు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫాదర్ లు, నిర్మల సిస్టర్స్, ఏ వి యం సిస్టర్స్, కాన్సిల్ మెంబెర్స్ ముక్కలా మర్రెడ్డి, వల్లమల్ల  బాలాస్వామి, పిండిగ అజయ్, నాగటి ఏసుదాసు, బంధ శ్యాంసన్, పట్టేటి బాలశౌరి, పాండురంగీ బాలరాజు, గోపికిరణ్, కతోలిక విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333