తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల  కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త

Jul 5, 2026 - 19:19
 0  0
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల  కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో భారీ స్థాయిలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7,437 పోస్టులకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసినట్లు బోర్డు చైర్మన్ వెల్లడించారు. ఈ నియామకాల్లో 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్ పోస్టులు, 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే 148 సివిల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా జైల్ వార్డెన్, ఫైర్ డిపార్ట్‌మెంట్ వార్డెన్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇదే ప్రక్రియలో విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డు చైర్మన్ తెలిపారు. దీంతో పోలీస్, జైల్, ఫైర్ సర్వీసుల్లో ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333