సాగర్ నీటితో చెరువుల నింపి త్రాగునీటి సమస్యను తీర్చాలి
మునగాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- సాగర్ ఎడమ కాలువకు నీటిని వదిలి లిఫ్టుల క్రింద ఉన్న చెరువులను, కుంటలను నింపి రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈ సంవత్సరం వేసవి ప్రారంభంలోని ఎండలు తీవ్రంగా మండి పోతున్నాయని దీంతో ఇప్పటికే బోర్లు, బావులో భూగర్భ జలాలు ఇంకిపోయి అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామాలలో మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు .ఈ సమస్య పరిష్కారం కావాలంటేరాష్ట్ర ప్రభుత్వంవెంటనే సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని వదలని కోరారు. ఈ విషయమైతక్షణమే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొని సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి లిఫ్ట్ ల క్రింద ఉన్న చెరువులు, కుంటలను నింపాలని కోరారు.