వనపర్తి జిల్లా వాల్మీకి కన్వీనర్ గా పెద్ద నరసింహ ఎంపిక
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని వెంకటం పల్లి గ్రామానికి చెందిన వాల్మీకి ముద్దు బిడ్డ పెద్ద నరసింహ ని వనపర్తి జిల్లాలో నిర్వహించిన వాల్మీకి ఆత్మీయుల సమ్మేళనంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా వాల్మీకి కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా మన చిన్నంబావి మండల వెంకటం పల్లి గ్రామానికి చెందిన వాల్మీకి ముద్దు బిడ్డ కు ఈ అవకాశం రావడం చాలా ఆనందం సంతోషకరమని అన్నారు. చిన్నంబావి మండల వాల్మీకి కమిటీ తరపున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాం. ముందు ముందు ఇంకా పెద్ద పదవులు చేరాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ తాలూకా వాల్మీకి అధ్యక్షులు రాజ్ కుమార్, కొల్లాపూర్ తాలూకా ట్రెజరర్ ఒంటెల సుధాకర్ నాయుడు, బీసీ సంఘం చిన్నంబావి మండలం అధ్యక్షులు గువ్వల రామకృష్ణ, చిన్నంబావి మండలం వాల్మీకి అధ్యక్షులు ఉమేష్ నాయుడు, చిన్నంబావి మండలం వాల్మీకి ప్రధాన కార్యదర్శి యాదగిరి నాయుడు, చిన్నంబావి మాజీ వాల్మీకి అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, కాలురు గ్రామ వాల్మీకి అధ్యక్షులు రామకృష్ణ నాయుడు, తిరుపతయ్య నాయుడు, బెక్కెం గ్రామం వాల్మీకి అధ్యక్షులు గోపాల్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.