పుస్తకాలు అమ్మే బుక్ స్టాల్ నుసీజ్ చేసిన అధికారులు
జోగులాంబ గద్వాల 24 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10 వేల నుంచి 12 వేల దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం... గద్వాల పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఒక ప్రైవేట్ స్థలాల్లో ఒక ఇల్లును అద్దెకి తీసుకొని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, శ్రీ చైతన్య లోగో ఉన్న బెల్టులు, టైలు , ఎక్కువ ధరకు అమ్ముతుండగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కో కన్వీనర్ కురువపల్లయ్య పట్టుకొని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కి సమాచారం ఇవ్వగా వెంటనే ఎంఈఓ అక్కడికి చేరుకొని పరిశీలించారు. 6,7 ,8, 9, 10 తరగతిలకు ప్రభుత్వ ద్వారా వచ్చే పాఠ్యపుస్తకాలనే వాడాలని, అలాంటివి ఇక్కడ ఏమి లేకుండా తమ సొంత సిలబస్ ఉన్న పాఠ్య పుస్తకాలను అమ్ముతున్నారని, ఇది ప్రభుత్వానికి విరుద్ధమని వెంటనే ఆ పుస్తకాలు అమ్మే బుక్ స్టాల్ ను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మండల ఎంఈఓ శ్రీనివాసరావు గౌడ్, వారి సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ జిల్లా కోకో కన్వీనర్ కురువపల్లయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు.