సరైన సౌకర్యాలు లేని బీసీ గురుకులం.
అటువైపు కూడా కన్నెత్తి చూడని అధికారుల వైనం.
జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణ ప్రతినిధి:- గద్వాల్ మండలం పరుమాల స్టేజీ వద్ద ఉన్న మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకులం హాస్టల్.అయితే ఇది ఉండవలసింది మల్దకల్ మండలం బిజ్వారం గ్రామములో ఉండవలసింది కానీ,అక్కడ సరైన బిల్డింగ్ లేకపోవడంతో పరుమాల స్టేజీ దగ్గర ఒక ప్రయివేట్ పాఠశాలకు మార్చడం జరిగింది.అక్కడ గురుకుల పాఠశాల ఉండి 6సంవత్సరాలు అయింది. అయితే సమస్యల వలయములో ఉంటున్న పాటించుకొని బిల్డింగ్ ఓనరు, అధికారులు.బిల్డింగ్ స్థలం దాదాపు 4 ఎకరాలు ఉంటుంది దానికి నెలకు రూ. 1లక్ష అరవై వేలు రూపాయలు ప్రిన్సిపాల్ కడుతున్నారు.బిల్డింగ్ ఓనర్ ను హాస్టల్ చుట్టుముటు ప్రహరీ గోడ కటించాలి అని ప్రిన్సిపాల్ అడిగితే ఇంకా రెంటు ఎక్కువ పెంచాలి అంటున్నాడు. గవర్నమెంట్ వాళ్లు లక్ష అరవై వేలు కాటే బదులు అవే అమౌంట్ తో స్థలం కొని మంచిగా హాస్టల్ ఎరుపాటు చేయొచ్చుగా అని అంటున్నారు విద్యార్థుల తల్లీ దండ్రులు. హాస్టల్ లోకి పాములు,తెలు,కప్పలు రావడముతో విద్యార్థులు భయపడుతూ,జ్వరాలు రావడముతో విద్యార్థులు ఇంటీ బాట పడుతున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకు ఊరికి వస్తారు అంటే ఇక్కడ పాములు,తెల్లు,కప్పలు వస్తున్నాయి అని సమాధానము చెబుతున్నారు.మరియూ మెనూ ప్రకారం పాటించడం పిల్లలు పండుకోవడానికి మంచాలు లేవు.నెలపైనే పండుకోవాలి. స్కూల్ ఓపెనింగ్ఐ 2 నెలలుగా అవుతున్న ఇంతవరకు నోట్ బుక్స్ ఇవ్వలేదు. కొందరికి డ్రస్.సుష్ కూడా ఇవ్వలేదు.కాబట్టి అధికారులు,నాయకులు కలెక్టర్,ఇట్టి విషయంలో విద్యార్థులకు ఎవరికి ప్రాణ హాని జరగకముందే సరి చూడాలని తల్లీదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మాపిల్లలకి ఏమైనా ప్రాణ హాని జరుగుతే ఎవరు బాధ్యతలు వహిస్తారు. హాస్టల్ చుట్టు పొలాలు ఉన్నాయి.వర్షాకాలంలో పంట పొలాల నుండి విష పురుగులు వస్తుంటాయి. ఎమ్మెల్యే,కలెక్టర్ హాస్టల్ విషయములో చర్యలు తీసుకోవాలి.ఎందుకంటే పది రోజుల క్రితం బీసీ బాలుర హాస్టల్ లో తెలు కుట్టి ఎంతో ఇబ్బందులు పడ్డారు అని విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పర్యవేక్షణ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.