ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని ఆకస్మిక తనిఖీ కలెక్టర్
జోగులాంబ గద్వాల 23 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నికలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ డాక్టర్ అనిరుద్ మరియు సూపర్వైజర్ స్టాప్ పి హెచ్ సి స్టాపు అందర్నీ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా phc లో op సంఖ్యను పెంచుకోవాలని మరియు డెలివరీస్ సంఖ్యని పెంచాలని సూచించారు. మరియు గర్భిణీ స్త్రీల కు చేస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు మరియు వారికి ఇస్తున్నటువంటి పోలిక్ యాసిడ్ మాత్రలు ఐరన్ పోలిక యాసిడ్ మాత్రమే కాల్షియం మాత్రలు గురించి అడిగి తెలుసుకున్నారు.మరియు మిగతా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నచో గద్వాలకు వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని చూయించుకోవాలని సూచించారు. మరియు గర్భిణీ స్త్రీల స్కానింగ్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. మరియు 102 వాహనం.108 వాహనాలు మీకు అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.మరియు డెలివరీ రూము. డ్రగ్స్ స్టోర్ రూమ్ అన్ని రూములు పరిశీలించారు. మరియు అన్ని గ్రామా లలో ఆశాల ద్వారాఫీవర్ సర్వే చేసి సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.