సత్యనారాయణపురం కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చర్ల ఆగస్టు 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఆగస్టు 15 జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రియదర్శిని పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకునే జాతీయ దినోత్సవాల్లో గొప్ప స్థానాన్ని కలిగి ఉంది చాలా సంతోషంగా జరుపుకునే గొప్ప పండుగ 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వలసవాదం బారి నుంచి విముక్తి కలిగిన రోజు 1947 ఆగస్టు 15 భారతదేశం బ్రిటిష్ వలసవాదం నుంచి స్వతంత్రంగా ప్రకటించబడింది. అనేకమంది సమరయోధుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర దినోత్సవం ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం మరియు అంగన్వాడి కార్యకర్తలు గ్రామస్తులు పెద్దలు పిల్లలు పాల్గొన్నారు